బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదు. చనిపోయి రెండేళ్లయినా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనని ఇప్పటికే చాలామంది వాదన. తాజాగా కూపర్ ఆస్పత్రి సిబ్బంది సుశాంత్‌ది హత్యేనని ఆరోపణలు చేయడంతో ఇప్పుడు మరో సంచలనంగా మారింది.
సుశాంత్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బృందంలోని ఓ వ్యక్తి హత్య ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్‌ది ఆత్మహత్య అనుకోవడం లేదని, అతడి శరీరంపై గాయాలున్నాయని ఆరోపిస్తుండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుశాంత్ చనిపోయిన రోజు తాను పనిచేస్తున్న కూపర్ ఆస్పత్రికి 5 మృతదేహాలు వచ్చాయని, అందులో ఒకటైన సుశాంత్ డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేసే బృందంలో తానూ ఉన్నట్టు చెప్పాడు.
సుశాంత్ సింగ్ పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయలేదని, పై అధికారుల ఆదేశాల మేరకు ఫొటోలు మాత్రమే తీశామని వెల్లడించాడు. శరీరంపై గాయాలు చూసి అప్పుడే హత్యగా భావించినట్లు తెలిపాడు. సుశాంత్ 2020 జూన్ 14న ముంబైలోని తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.