బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకుని అందర్నీ షాక్‌కు గురి చేశాడు. మానసిక ఆందోళన కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెట్టిన పలు ట్వీట్లు ప్రస్తుతం అందర్నీ కన్నీరు పెట్టిస్తున్నాయి. జీవితంలో తాను సాధించాలనుకున్న 50 కలలను పేపర్‌పై రాసి.. ’50 డ్రీమ్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ కౌంటింగ్’ అని పేర్కొంటూ అభిమానులతో పంచుకున్నారు. అలా ఆయన పంచుకున్న కలల్లో కొన్ని..
విమానాన్ని నడపడం నేర్చుకోవాలి, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మోర్స్ కోడ్ నేర్చుకోవాలి. అంతరిక్షం విశేషాలు చిన్నారులు తెలుసుకొనేందుకు సాయం చేయాలి. ఛాంపియన్‌తో టెన్నీస్ ఆడాలి. నాలుగు క్లాప్ పుషప్స్ చేయాలి. ‘బ్లూహోల్’లోకి డైవ్. 1000 మొక్కలు నాటాలి. ఢిల్లీలోని నా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఓ సాయంత్రం సరదాగా గడపాలి. నాసా, ఇస్రోలో జరిగే వర్క్‌షాప్‌లకు 100 మంది చిన్నారులను పంపించాలి. కైలాశ్ ప్రాంతంలో మెడిటేషన్ చేయాలి. మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వాలి. ఓ బుక్ రాయాలి. ఆరు నెలల్లో సిక్స్‌ప్యాక్ బాడీ సాధించాలి. అంథులకు కోడింగ్‌లో శిక్షణ ఇవ్వాలి. ఒక వారం అడవిలోనే గడపాలి. పురాతన ఆస్ట్రాలజీని తెలుసుకోవాలి. డిస్నీల్యాండ్. ఉచిత విద్య కోసం కృషి చేయాలి. కనీసం పది రకాల డ్యాన్స్‌లను నేర్చుకోవాలి. ఐరోపా మొత్తాన్ని రైలులో చుట్టేయాలి. లంబోర్గినీ కారు కొనుగోలు చేయాలి. ఇష్టమైన 50 పాటలకు గిటార్ వాయించడం నేర్చుకోవాలి. వివేకానంద జీవితం గురించి ఓ డాక్యూమెంటరీ తెరకెక్కించాలి. అంటార్కిటికాలో పర్యటించాలి. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి.
The heartbreaking end of a dreamer: the 50 dreams of #SushantSinghRajput pic.twitter.com/VPgR8Tr0qJ
— Mahim Pratap Singh (@mayhempsingh) June 14, 2020