బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అందర్నీ ఆశ్చర్యనికి గురి చేసింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోగా నిలిచాడు సుశాంత్. కానీ ఆయనకు ఎవరూ సపోర్ట్ ఇవ్వలేదు.. అందుకే త్వరగానే నేలరాలిపోయాడు ఈ యువ కెరటం. బాలీవుడ్ కుళ్లు కుతంత్రాలు తట్టుకోలేక.. నవ్వుతూనే గొంతు కోసేవాళ్ల మోసాలు భరించలేక కేవలం 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించాడు ఈ యువ నటుడు. ఈయన మరణానికి న్యాయం జరగాల్సిందే అంటూ బీహార్‌లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ నిర్మిస్తానంటూ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ప్రకటించాడు. బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన ట్విట్టర్ వేదికగా సుశాంత్ బయోపిక్‌ను ప్రకటించాడు. దాంతో అభిమానులు ఒక్కసారిగా ఆయనపై పడిపోయారు.. నీకు సుశాంత్ బయోపిక్ తీసే అర్హత లేదు.. నువ్వు కాదు ఒకప్పుడు సుశాంత్‌ను నటుడే కాదని విమర్శించింది.. మొహంలో ఎక్స్‌ప్రెషన్ లేదంటూ ఆయన మంచి సినిమాలను కూడా నాశనం చేసింది అంటూ మండి పడుతున్నారు.
ఆయన బయోపిక్ ప్రకటనను నిరసనగా #FakeKRKRealCulpritOfSushant అనే ట్యాగ్‌తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కించపరిచేలా చాలా చేసాడు కమల్ ఆర్ ఖాన్. ఇప్పుడు ఆయనపై సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తున్నావా అంటూ మండి పడుతున్నారు. సుశాంత్‌ను మోసం చేసిన వాళ్లలో కూడా నువ్వు కూడా ఉన్నావ్.. నువ్వు కానీ బయోపిక్ చేస్తే ఇంటికి వచ్చి మరీ కొడతాం అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఆయన మాత్రం బాలీవుడ్ రాజకీయాలతో పాటు సుశాంత్‌కు న్యాయం చేసేలా తన సినిమాను నిర్మిస్తానని చెప్తున్నాడు.