HomeTelugu Trendingసుశాంత్‌ కుటుంబంలో తీవ్ర విషాదం..

సుశాంత్‌ కుటుంబంలో తీవ్ర విషాదం..

Sushant singh rajput 6 rela
దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్‌ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్‌ బంధువు ఓం ప్రకాశ్‌ సింగ్‌ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్‌ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది.

వారు ప్రయాణిస్తున్న సుమో ట్రక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో మొత్తం 10మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో సుశాంత్‌ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాశ్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu