బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. సుశాంత్ అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ పలువురిలో మాత్రం ఇంకా ఆత్మహత్యా లేక హత్యా అనే అనుమానాలు లేకపోలేదు. అవకాశాలు లేక డిప్రెషన్‌కు గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పలువురు కామెంట్లు చేసినప్పటికీ సుశాంత్ సన్నిహితులు వాటిని కొట్టిపారేశారు. వచ్చే ఏడాది చివరి వరకు సుశాంత్ డైరీ ఫుల్‌గా ఉందని అన్నారు. తాజాగా నిర్మాత రమేష్ తౌరానీ, సుశాంత్ గురించి మాట్లాడుతూ చనిపోయే ముందురోజు ఓ కథను వినిపించినట్లు ఆయన తెలిపారు. దర్శకుడు నిఖిల్ అద్వానీ, తాను జూన్ 13న సాయత్రం సుశాంత్‌తో ఓ స్టోరీ డిస్కషన్ చేశామని అన్నారు. రిపోర్టులో కూడా వీరు దాదాపు 12 నిమిషాలు మాట్లాడినట్లు తేలింది. ఇక ఆ తరువాత తాను సుశాంత్ మేనేజర్‌తో 5 నుంచి 6 నిమిషాలు మాట్లాడినట్లు రమేష్ తెలిపారు. కథ చాలా బావుందని, మొత్తం స్క్రిప్ట్‌ని తయారుచేసుకొని రావాలని సుశాంత్ చెప్పినట్లు కూడా రమేష్ వివరించారు.