‘నా పేరు చెగెవారా. నా దగ్గర డబ్బు లేదు. కానీ, నాకొక కల ఉంది. సమాజానికి సేవ చేయాలి…’ అంటున్నారు బండి సరోజ్ కుమార్. ఆయన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘సూర్యాస్తమయం’. త్రిశూల్ మరో హీరోగా నటిస్తున్నారు. హిమాన్సి హీరోయిన్. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒక విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సూర్యాస్తమయం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
చెగెవారా స్ఫూర్తితో తాను కథని రాసుకున్నానని ‘సూర్యాస్తమయం’ పేరు ఎందుకు పెట్టామనేది సస్పెన్స్ అని దర్శకుడు బండి సరోజ్ ఇటీవల చెప్పారు. కథ, మాటలు, పాటలు, సంగీతం, ఫొటోగ్రఫీలే కాకుండా మరో ఐదు శాఖల బాధ్యతల్ని తానే నిర్వహించినట్లు తెలిపారు. ఓజో మీడియా పతాకంపై రఘు పిల్లుట్ల, రవికుమార్ సుదర్శిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.