బోయపాటి తో సూర్య సినిమా!


టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘స్కంద’. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈక్రమంలో బోయపాటి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి.

కోలీవుడ్ తాజా సమాచారం మేరకు బోయపాటి-సూర్య చిత్రం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవనుంది. దాంతో, తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త కాంబినేషన్ అభిమానులను అలరించనుంది. బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా.. సూర్య ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు.

ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బోయపాటి గతంలో పలు ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu