తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించే సినిమాలు తెలుగులో కూడా అదే రేంజ్ లో విడుదల
అవుతుంటాయి. అయితే ఈసారి ఆయన సినిమాకు పోటీగా చరణ్ సినిమా రాబోతోంది. సూర్య
నటిస్తోన్న సింగం సిరీస్ సక్సెస్ కావడంతో అందులో భాగంగా ఇప్పుడు సింగం3 సినిమా
రాబోతుంది. ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై
ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసంబర్ 16న విడుదల చేయడానికి
ప్లాన్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ నటించిన ‘దృవ’ చిత్రాన్ని కూడా అదే రోజు లేదా
డిసంబర్ 17న విడుదల చేయాలనుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న
సినిమా కాబట్టి అల్లు అరవింద్ కచ్చితంగా అత్యధిక థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తారు.
ఆ సమయంలో సూర్య సినిమాకు థియేటర్స్ దొరకకపోయినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. సో..
సూర్యకు, చరణ్ నుండి గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం!