సూర్య హీరోగా నటిస్తున్న ‘సింగం3’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా
తరువాత ఆయన ‘కబాలి’ డైరెక్టర్ రంజిత్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి.
కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో
దర్శకుడు విఘ్నేశ్ శివన్, సూర్యను కలిసి ఓ కథను వినిపించరాట. ఆ కథ సూర్యకు
బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో
హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని విఘ్నేశ్ ప్రతిపాదన. సూర్య కాదని చెప్పిన
వినకుండా ఆమెనే తీసుకోవాలని పట్టుబట్టాడట. ఇప్పుడు ఈ విషయమై కోలీవుడ్
అంతా చర్చ జరుగుతుంది.