తమిళనాడు నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడం వలనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతితో కోలీవుడ్ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.
విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా హీరో సూర్య సైతం ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేశాడు.
‘తనతో కలిసి పనిచేసిన, మాట్లాడిన, తిన్న రోజులు మరువలేనివి..అతను ఎవరికీ నో చెప్పలేదు. కడకోడి ప్రజలకు సహాయం చేస్తూ విప్లవ కళాకారుడిగా ఎదిగిన అన్నన్ విజయకాంత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
அவருடன் பணியாற்றிய, பேசிப்பழகிய, சேர்ந்து சாப்பிட்ட நாட்கள் மறக்க முடியாதவை…
யார் என்ன கேட்டாலும் இல்லை என்று அவர் சொன்னதே இல்லை..
கடைக்கோடி மக்கள் வரை உதவி செய்து புரட்சிக் கலைஞனாக உயர்ந்த அண்ணன் விஜயகாந்த் அவர்களின் மறைவிற்கு ஆழ்ந்த இரங்கல்!! pic.twitter.com/PHeqHNG3uk
— Suriya Sivakumar (@Suriya_offl) December 28, 2023