Top 10 Most Popular Actresses List:
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. తమ అద్భుతమైన నటన, అందం, ఫ్యాషన్ సెన్స్, మంచి వ్యక్తిత్వాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు. తాజాగా Ormax Media India’s Most Popular Female Stars 2024 జాబితాను ఇటీవల విడుదల చేశారు. ఈ జాబితాలో టాప్ 10లో ఆరు స్థానాలను దక్షిణ భారత నటీమణులు ఆక్రమించటం గమనార్హం. బాలీవుడ్ స్టార్‌లను అధిగమిస్తూ ఈ దక్షిణాది తారలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది సౌత్ హాట్ బ్యూటీ సమంత. ఆరోగ్య సమస్యల కారణంగా వృత్తిరంగం నుండి విరామం తీసుకున్నప్పటికీ, సమంత తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఎంతో విశేషం. సమంత క్రేజ్ తగ్గకపోగా, బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ నటీమణులైన ఆలియా భట్, దీపికా పదుకొనే లాంటి ప్రముఖులను అధిగమిస్తూ టాప్ స్థానంలో కొనసాగుతోంది సామ్.
ప్రస్తుతానికి, ఆమె నటించిన వెబ్ సిరీస్ Citadel: Honey Bunny నవంబర్ 7, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. తక్కువ సినిమాల్లో కనిపించినా, ప్రేక్షకులు ఆమెను మరిచిపోకుండా మరింతగా ఆదరిస్తున్నారు.
సమంతతో పాటు నయనతార, త్రిషా కృష్ణన్, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, మరియు రష్మిక మందన్న టాప్ 10లో నిలిచారు. దక్షిణ భారతీయ తారలు టాప్ 10లో ఆరు స్థానాలు దక్కించుకోవడం బాలీవుడ్ తారలకు మించిన ఘనత.
బాలీవుడ్ నుండి ఆలియా భట్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, మరియు కియారా అద్వానీ మాత్రమే టాప్ 10లో స్థానం సంపాదించుకున్నారు.
ఈ జాబితా దక్షిణాది సినీ తారల విశేషమైన ప్రజాదరణను స్పష్టంగా చూపిస్తోంది, ఇంతటి ప్రభావం అంతర్జాతీయంగా కూడా చూసే అవకాశం ఉంది.
Top 10 Most Popular Actresses 2024:
1. సమంత రుత్ ప్రభూ
2. ఆలియా భట్
3. దీపికా పదుకొనే
4. నయనతార
5. త్రిషా కృష్ణన్
6. శ్రద్ధా కపూర్
7. కాజల్ అగర్వాల్
8. సాయి పల్లవి
9. రష్మిక మందన్న
10. కియారా అద్వానీ
Read More: Bigg Boss 8 Telugu నుండి ఈ వారం బయటకు రాబోతున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా?