కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలో మంచి పేరు ఉంది. ప్రస్తుతం సూర్య కాప్పన్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటె, సూర్య సతీమణి జ్యోతిక సిని పరిశ్రమ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. అనేక హిట్ సినిమాలు చేసింది. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తుంది. జ్యోతిక హీరోయిన్ గా చేసిన చంద్రముఖి ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.
సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తోంది. మరో రెండేళ్లలో తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జ్యోతిక ఓ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ పార్టీ ఏంటి.. ఎక్కడి నుంచి పోటీ చెయ్యొచ్చు అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ న్యూస్ మాత్రం కోలీవుడ్ న్యూస్ మీడియాలో యమా ట్రెండ్ అవుతున్నది.