HomeTelugu Big Storiesజ్యోతిక వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం: సూర్య

జ్యోతిక వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం: సూర్య

3a

జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు కాస్త దూరమైయింది. ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. కిందటేడాది ‘రాచ్చసి’ సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో నటనకు గాను ‘జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ 2020’లో ఆమె ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది. అవార్డు తీసుకున్న అనంతరం జ్యోతిక మాట్లాడుతూ హాస్పిటల్, స్కూల్స్‌ను ఇంకా బాగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ‘మనం ఆలయాలను బాగా శుభ్రం చేస్తాం, పెయింట్ వేస్తాం, బాగా మెయింటైన్ చేస్తాం, ఆలయ హుండీలో డబ్బులు వేస్తాం. దయచేసి అవే డబ్బులు హాస్పిటల్స్‌కు పెట్టండి, పాఠశాలల అభివృద్ధికి వాడండి. ఇది చాలా ముఖ్యం. దయచేసి హాస్పిటల్స్, స్కూల్స్‌ కు కూడా విరాళాలు ఇవ్వండి’ అని జ్యోతిక మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారావు రేగింది. సోషల్ మీడియా వేదికగా పలు చర్చలకు దారితీసింది. ఈ వ్యవహారంపై స్పందించిన సూర్య.. జ్యోతిక చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నామన్నారు. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో మాకు దక్కిన ఆధరణకు కృతజ్ఞతలు. పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలను అనుసరించి మేం వ్యక్తపరిచిన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాం’ అన్నారు సూర్య.

Recent Articles English

Gallery

Recent Articles Telugu