HomeTelugu Trending'సూర్య 42' మోషన్‌ పోస్టర్‌ విడుదల

‘సూర్య 42’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

Surya new movie motion post
కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 42వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 10 భాషల్లో త్రీడీ ఫార్మేట్‌లో విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ వారు .. స్టూడియో గ్రీన్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యతో ఆయన చేయనున్న సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. సూర్య ఈ పోస్టర్‌ లో యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నాడు. ఆయన లుక్ .. కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటించగా.. యోగిబాబు ముఖ్యమైన పాత్రలో అలరించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu