యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత ‘సాహో’ సినిమా భారీ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ, సినిమా టాలీవుడ్ లో పెద్దగా హిట్ కాలేకపోయింది. బాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అక్కడ భారీ కలెక్షన్లు వసూలు చేసింది సినిమా. ఈ సినిమా తరువాత ప్రభాస్ ప్రస్తుతం జాన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 30శాతం వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ వరకు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నది.
ఆ తరువాత ప్రభాస్ ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్నది క్లారిటీ లేదు. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బన్నీ, మహేష్, రవితేజ అందరు మరో ప్రాజెక్ట్ తో బిజీ కావడంతో.. సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడట. ప్రభాస్ కోసం కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. కథ ఒకే అయితే, వెంటనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.