టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉన్నా.. వారి ప్రోత్సాహం ప్రోద్బలంతోనే సునీత మ్యాంగో అధినేత రామ్ ని పెళ్లాడారు. మళ్లీ టాలీవుడ్‌లో అటువంటి పెళ్లి జరగనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నటి సురేఖా వాణి రెండో వివాహానినికి రెడీ అవుతున్నారు అనే వార్త ఆసక్తికరంగా మారింది. కిడ్స్ అనుమతితో గాయని సునీత ఓ ఇంటివారయ్యారు. ఆ సంగతి సురేఖా వాణి కుమార్తె సుప్రీతను కదిలించించిందట. సురేఖా వాణి భర్త 2019లో అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి తన కుమార్తెతో ఒంటరి తల్లిగా జీవిస్తున్నారు.
సురేఖా వాణి కుమార్తె తన తల్లిని తిరిగి వివాహం చేసుకోవాలని ప్రోత్సహించిందని చర్చ మొదలైంది. అన్నీ అనుకూలిస్తే కుమార్తె సమక్షంలో ఈ నటి కూడా వివాహం చేసుకోవచ్చన్న వినికిడి. పెళ్లి తర్వాత సునీత ఎంతో ఆనందంగా ఉన్నారు. కెరీర్ పరంగానూ స్పీడ్ పెంచారని తెలుస్తోంది. కానీ కొత్త అంకంతోనే నూతనోత్సాహం మరింతగా రెట్టిస్తుందని కెరీర్ పరంగా జోష్ పెంచుతుందని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాల్లో ఫొటోషూట్లు హద్దులు చెరిపేసి హాట్ టాపిక్ సురేఖా వాణి.