HomeTelugu Trendingసినిమాలలో అవకాశాలు ఇవ్వడం లేదు: సురేఖ వాణి

సినిమాలలో అవకాశాలు ఇవ్వడం లేదు: సురేఖ వాణి

Surekha vani emotional spee
టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పానసరం లేదు. పలు సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. అయితే, ఇటీవలి కాలంలో ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమాలకు సురేఖ గుడ్ బై చెప్పిందని అంటున్నారు. ఈ వార్తలపై సరేఖ స్పందిస్తూ.. తాను సినిమాల్లో కనిపించకపోవడానికి గల కారణాన్ని వివరించింది.

సినిమాలలో నటించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని… అయితే, తనకు ఎవరూ అవకాశాలను ఇవ్వడం లేదని చెప్పింది. ‘స్వాతిముత్యం’ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణకు ధన్యవాదాలు తెలిపింది. ఈ చిత్రంలో బొల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సురేఖ ఈ వ్యాఖ్యలు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu