HomeTelugu Trendingసురేఖ వాణి బిగ్‌బాస్‌ ఎంట్రీ.. స్పందించిన కూతురు

సురేఖ వాణి బిగ్‌బాస్‌ ఎంట్రీ.. స్పందించిన కూతురు

Surekha vani daughter supriతెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన సభ్యుల జాబితా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కూడా వరుసగా ప్రొమోలు విడుదల చేస్తున్నాడు. మరోవైపు ఈ సీజన్‌లో సినీనటి ప్రముఖ నటి సురేఖవాణి కూడా పాల్గొంటుంన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించారు. సుప్రీత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడింది.

ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను సుప్రీత వెల్లడించారు. తన తల్లి బిగ్‌బాస్‌లో పాల్గొనడం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఆ విషయం గురించి తన తల్లి తనకు ఏమీ చెప్పలేదని వెల్లడించింది. ఇక తన పెళ్లి గురించి అడగగా ప్రస్తుతం తన వయసు 20 ఏళ్లు మాత్రమేనని పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని సమాధానం చెప్పింది. తనకు కాబోయే భర్త తనను అర్థం చేసుకునేవాడై ఉండాలని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu