పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-7 ఊహించని మలుపులతో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో పాల్గొనబోయే వారు బుల్లితెరపై ఫేమస్ అయిన సెలబ్రిటీలు, యాంకర్లు, మోడళ్లు, యూట్యూబర్స్ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వచ్చేనెలలో ప్రారంభం కాబోతుంది. హీరో నాగార్జున మరోసారి ఈ షోకి హోస్ట్‌గా చేయనున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్7లో పాల్గొనేవారి ఎంపిక కూడా పూర్తయింది. ఇప్పటికే 2 ప్రోమోలతో ఈ సీజన్‌పై హైప్ క్రియేట్ చేశారు.
ఈ సీజన్‌లో ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఫర్జానాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 2006లో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఫర్జానా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. నటుడు అబ్బాస్ కూడా బిగ్‌బాస్‌కు ఎంపిక అయినట్టు చెప్తున్నారు. న్యూజిలాండ్‌లో ఉంటున్న అబ్బాస్ ఇటీవలే ఇండియాకు వచ్చాడు. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఈసారి బిగ్‌బాస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్ మొదలయ్యే వరకు పార్టిసిపెంట్స్ పేర్లను సీక్రెట్‌గానే ఉంచనున్నారు. ఫైనల్‌గా ఎవరిని ఎంపిక చేశారో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.