HomeTelugu Trendingసురవరం ప్రతాపరెడ్డి షార్ట్ ఫిలిం కాంటెస్ట్: 'గ్యారా కద్దూ బారా కొత్వాల్'కి ఫస్ట్‌ ప్రైజ్‌

సురవరం ప్రతాపరెడ్డి షార్ట్ ఫిలిం కాంటెస్ట్: ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’కి ఫస్ట్‌ ప్రైజ్‌

suravaram

ప్రముఖ రచయిత, కవి, సంపాదకుడు, తెలంగాణ వైతాళికుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహించింది. ఈ కాంటెస్ట్ లో సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏదైనా కథల్లోంచి ఒక దాన్ని తీసుకొని దానిని సినిమా రూపంలో తెరకెక్కించాలి. అలాగే ఈ కాంటెస్ట్ లో అవార్డులు, ప్రైజ్ మనీలు కూడా అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ సురవరం ప్రతాపరెడ్డి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో దాదాపు 50 షార్ట్ ఫిలిమ్స్ పాల్గొన్నాయి.

తాజాగా మే 28న సురవరం ప్రతాప రెడ్డి 126వ జయంతి ఉత్సవాలని తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, సామాజిక సేవా ప్రముఖులు పలువురు విచ్చేశారు. ఈ కార్యక్రమంలోనే షార్ట్ ఫిలిం కాంటెస్టుల విజేతలని కూడా అనౌన్స్ చేసి ప్రైజ్ మనీ అందించారు.

suravaram1ఈ సురవరం ప్రతాపరెడ్డి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ సినిమాకి గాను మొదటి బహుమతి వచ్చింది. ఈ సినిమాని ప్రముఖ సినీ, టీవీ నటులు లోహిత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించి, నిర్మించారు. అంతే కాక ఇందులో పలువురు ఆర్టిస్టులు నటించగా దాదాపు 30 పాత్రలకి లోహిత్ కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సినిమాకి గోపి దర్శకత్వం వహించగా మణీంద్ర కుమార్ సినిమాటోగ్రాఫర్ పని చేశారు. ఈ సినిమా మొదటి బహుమతిని అందుకొని 50 వేల నగదు బహుమతిని కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకుంది. అలాగే ఈ ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ సినిమాకి అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన మణీంద్ర కుమార్ కి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు కూడా వరించింది. అంతేకాక 20 వేల నగదు బహుమతి కూడా అందుకున్నారు.

ఈ అవార్డు, నగదు బహుమతులని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకిషన్, తెలంగాణ భాషా సాంసృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ మరి కొంతమంది ప్రముఖులచే ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ సినిమా టీం లోహిత్ కుమార్, గోపి, మణీంద్ర కుమార్, రామకృష్ణ, సాకేత్, మరి కొంతమంది అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu