HomeTelugu Trendingబాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు!

బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme court notice to nan
హీరో.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. సినిమా రిలీజ్ సమయంలో పన్ను రాయితీ తీసుకుని.. టికెట్ రేట్లు ఎందుకు తగ్గించలేదని.. అలాగే పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ, సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu