లాక్‌డౌన్ నేపథ్యంలో దేశమంతటా ఆంక్షలు అమలవుతున్న ఈ సమయంలో పలు రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతులిచ్చాయి. లాక్‌డౌన్ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాలపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న ధర్మాసనం మద్యం అమ్మకాల్లో ఆన్‌లైన్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం నిబంధన పాటించేందుకు, ప్రజలు పెద్దఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు హోం డెలివరీ
ఉపకరిస్తుందని వ్యాఖ్యానించింది.