అయోధ్య భూమి వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును వెల్లడించారు. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివాదాస్పద స్థలం హిందువులదేనని, మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సీజేఐ వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. దీనిపై కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని వివరించారు. నిర్ణయానికి ముందు
రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ పేర్కొన్నారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.