టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఏడేళ్లు నిండి ఎనిమిదవ ఏటా అడుగుపెట్టింది ఈ చిన్నారి. నమ్రత, అన్న గౌతమ్ లు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ విషెస్ చేశారు. మహేష్ బాబు మాత్రం కూతురితో గడిపిన ఆనందక్షణాలకి సంబంధించిన ఫోటోస్‌ని వీడియోగా మార్చి షేర్ చేశాడు. సితారకి 8 ఏళ్ళు. ఎంత వేగంగా ఎదుగుతుందో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. ఈ విషయం ఎప్పటికీ తెలియదు. జన్మదిన శుభాకాంక్షలు సితార అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ఇక మహేష్ బాబు ఫ్యాన్స్‌లో సితారకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సితార పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు.