సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘మహర్షి’. మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఉగాది సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి’ ‘సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో మహేష్‌బాబు చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘నాకో ప్రాబ్లమ్ ఉంది సర్. ఎవడైనా ‘నువ్వు ఓడిపోతావ్ అంటే’ గెలిచి చూపించడం నాకు అలవాటు’ అనే పంచ్‌డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెల 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిషి ప్రయాణం ఎక్కడి నుంచి, ఎక్కడి వరకు సాగిందో తెరపైనే చూడాలంటోంది చిత్రబృందం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్‌లో పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.