సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పేరుమీదున్న ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్‌లలో ఒకటి. ఇక మహేశ్ కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోనూ అడుగుపెట్టారు. మహేశ్‌కు సంబంధించిన అన్ని వ్యాపారాలను ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటుంటారు.
తాజా సమాచారం ప్రకారం.. మహేశ్‌బాబు హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. తన భార్య నమ్రత పేరుతో ఈ హోటల్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. మినర్వ గ్రూప్‌తో కలిసి మినర్వా -ఏఎన్ (ఏఎన్-ఏషియన్ నమ్రతా) పేరుతో బంజారాహిల్స్‌లో రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే ఈ బిజినెస్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం.. మహేశ్ 28వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది.