Kalki 2898 AD Part 2:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన.. కల్కి 2898 AD సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన మొదటి రోజు నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసుకుంది.
బాలీవుడ్ నటులు దీపిక పడుకొనే, అమితాబ్ బచ్చన్ లతో పాటు కమల్ హాసన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర లలో కనిపించారు. సినిమాలో కమల్ హాసన్ ముఖ్య విలన్ గా కనిపించారు. అయితే ఆయన పాత్ర కనిపించేది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే. కానీ ఆ ప్రభావం మాత్రం చాలా రోజులు ఉంది.
సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ చాలా అద్భుతంగా నటించారు. అయితే కమల్ హాసన్ కంటే ముందు ఈ పాత్ర కోసం చాలామంది స్టార్లను అనుకున్నారట. అందులో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒకరు. అప్పటికే భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ గా దీపిక పడుకొనే లను ఫిక్స్ చేసేసారట.
ముందు మోహన్ లాల్ ను సుప్రీమ్ యాస్కిన్ పాత్ర కోసం సంప్రదించాలని అనుకున్నారట. కానీ లాస్ట్ లో కమల్ హాసన్ అయితే బాగుంటుంది అని అనుకున్నారట. మరి సుప్రీమ్ యాస్కీన్ పాత్రలో కమల్ హాసన్ బదులు.. మోహన్ లాల్ నటిస్తే ఎలా ఉండేదో అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.
ఏదేమైనా కమల్ హాసన్ అభిమానులు మాత్రం.. ఆ పాత్రలో కమల్ సెట్ అయినట్లు.. ఇంకెవరు అవ్వలేరేమో అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కల్కి 2898 AD సినిమా రెండవ భాగం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ను కర్ణుడి పాత్రలో చూడడానికి ఫ్యాన్స్ చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నారు.