ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్-2 చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ బ్రహాండమైన వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు ఏపి, తెలంగాణల్లో రూ.5 కోట్ల షేర్ అందుకుని మూడు రోజులకు గాను రూ.14.3 కోట్లు ఖాతాలో
వేసుకుంది. అలాగే ఓవర్‌సీస్‌లో సైతం ప్రస్తుతం 993,645 డాలర్లను కలెక్ట్ చేసింది. రేపటికి ఈ మొత్తం మిలియన్ మార్కును దాటనుంది. ఇదే జోరు ఇంకో రెండు మూడు రోజులు కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి వెనక్కి వచ్చి లాభాలు మొదలవుతాయి. ఈ సంక్రాంతికి ఎఫ్ 2′ తో పాటు ‘కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలు
విడుదలైన సంగతి తెలిసిందే.