హాట్ బ్యూటీ సన్నీలియోన్… పాత్రలకు తగినట్లు ఒదిగిపోయేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె కాస్త లావైందనే విమర్శలు రావడంతో… అభిమానుల అంచనాలకు పూర్తి భిన్నంగా కనిపించింది సన్నీ లియోన్.సన్నీయేనా… ఇంత స్లిమ్‌గా ఎలా అయిపోయింది అని ఆశ్చర్య పడేలా మారిపోయింది.. ఈ రాగిణీ MMS సిరీస్ బ్యూటీ. బాలీవుడ్ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే… సన్నీ లియోన్ కోసం ప్రత్యేక కాస్ట్యూమ్ రూపొందించారు. ఆ గార్జియస్ గౌన్‌లో తనకు చాలా నచ్చిందనీ… తాను మరింత అందంగా కనిపిస్తున్నానని తెలిపింది సన్నీ. సన్నీ కోసం స్వప్నిల్ షిండేతో పాటూ… ఫ్యాషన్ డిజైనర్లు హితేంద్ర కపోపారా, సమీర్ కటారియా కూడా ఈ డ్రెస్, స్టైల్, డిజైన్లకు సహకరించారు. అందరూ కలిసి.. అదిరిపోయే డ్రెస్ రెడీ చేశారు. ఇక… అయినా సిల్వర్ జ్యువెలరీ సంస్థ రూపొందించిన డైమండ్ రాక్స్‌లో మెరిసిపోతోంది సన్నీలియోన్.
ఐతే… కొంత మంది… సన్నీ లియోన్ చేతిలో ఉన్న బ్యాగులపై ఇదివరకు విమర్శలు చేశారు. ఏ కుందేలు చర్మంతోనో వాటిని చేసి ఉంటారని అన్నారు. ఈసారి కూడా అలా భావిస్తారని ముందే ఊహించిన సన్నీ లియోన్… తన చేతిలో వెగాన్ బ్యాగ్‌కి ఉన్నవి నిజమైన ఈకలు (feathers) కావనీ… అవి నకిలీ ఫెదర్స్ అనీ క్లారిటీగా చెప్పింది సన్నీ. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Loved this so much! Thank you Swapnil Shinde for this gorgeous gown! I felt so pretty in this…
P.S: (it’s not real feathers- fake feathers used on this vegan bag) pic.twitter.com/riW7KDAYtv
— Sunny Leone (@SunnyLeone) February 10, 2020