భారత్లో లాక్డౌన్ విధించిన మొదట్లో బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ అమెరికా వెళ్ళిపోయింది. అయినా తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. లండన్లో అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలతో ఎంజాయ్ చేస్తోంది. ఇండియా వదిలి రావడం ఇష్టం లేకపోయినా, భర్త వెబర్ తల్లిగారిని చూసుకోవడం కోసం లండన్ వెళ్లినట్టు ఇప్పటికే సన్నీలియోన్ తెలిపింది.
లాక్ డౌన్ కాలంలోనూ సన్నీలియోన్ తన బిజినెస్ ను మానలేదు. సొంతంగా ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తులను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు, హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటోంది. రీసెంట్ గా సన్నీ బ్లాక్ స్విమ్ సూట్ లో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. స్నేహితురాలితో కలిసి వయ్యారంగా ఫోజులు ఇచ్చిన సన్నీ స్విమ్ సూట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.