బాలీవుడ్ నటి సన్నిలియోన్ అన్ని తరహా పాత్రల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరమదేవి అనే చారిత్రక కథా చిత్రంలో వీరనారిగానూ నటిస్తోంది. అయినా ఈ బ్యూటీకి ఐటమ్ గర్ల్ అనే ముద్ర మాత్రం పర్మినెంట్ అయిపోయిందని చెప్పక తప్పుదు. సన్నీ స్టెప్ వేసిందంటే కేక అంటారు. అలా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన ఐటమ్ సాంగ్స్‌తో కేక పుట్టిస్తున్న ఈ భామ తాజాగా మరోసారి కోలీవుడ్‌లో తన ఆట పాటతో దుమ్మురేపడానికి సై అంది. విశాల్‌తో కలిసి ఐటమ్ సాంగ్‌కు రెడీ అనేసిందన్నది తాజా సమాచారం.
విశాల్ ప్రస్తుతం ‘అయోగ్య’ చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. నూతన దర్శకుడు, ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో జూనియన్ ఎన్‌టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ పోలీస్ అధికారిగా వైవిధ్యభరిత పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నటి సన్నీలియోన్‌తో కలిసి ఐటమ్ సాంగ్‌లో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు పార్థిబన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయోగ్య చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు విశాల్. 2019 ప్రథమార్థంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.