లాక్‌డౌన్‌లో సెలెబ్రిటీలు ఎలా టైమ్ పాస్ చేస్తున్నారోనని అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉంటారు సెలెబ్రిటీలు. టూర్ల పేరుతో విదేశాలకు
చెక్కేసే స్టార్లు ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటున్నారు. నిత్యవసరాల కోసం సామాన్యులు బయటకు వస్తున్నారని కానీ.. సెలెబ్రిటీలు మాత్రం ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. అలాంటి వారి గురించి వాళ్లు షేర్ చేస్తే తప్ప వారి వివరాలు బయటకు రావడం లేదు.
పెద్దల సినిమా రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్ ఇప్పుడు భర్త డేనియల్, తన పిల్లలతో హ్యాపీగా
గడిపేస్తోంది. సన్నీలియోన్ గురించి తన భర్త ఓ షాకింగ్ నిజం బయటపెట్టాడు. సన్నీలియోన్ అలిసిపోయి రోజంతా నిద్రపోయిందని, తానే ఇంటిపని మొత్తం చేసినట్టు చెప్పాడు.
సన్నీకి బద్ధకం ఎక్కువ అని కూడా చెప్పుకొచ్చాడు డేనియల్.