బాలీవుడ్‌లో ఫోర్న్ స్టార్ నుండి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సన్నీలియోని ఇప్పుడు తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేయనున్నారు. త్వరలోనే నిర్మాతగా అవతారం ఎత్తనున్నారు. సొంత బ్యానర్‌లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ తన భర్త డేనియల్ వెబర్ చూసుకుంటారని తెలిపారు.
‘మా చిత్రం ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో సందేశాలుండవు. ఇది ఒక ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్. నిర్మాతనని నాకు ఎలాంటి ఇగో లేదు. సినిమా సెట్‌లో టీ అందించమన్నా ఎలాంటి సంకోచం లేకుండా అందిస్తా. నాకు అందరూ సమానమే” అని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. బడ్జెట్, కథ మన అధీనంలో ఉన్నప్పుడు ఎవరినీ నిందిచాల్సిన అవసరం ఉండదని చెబుతోంది. ఒక పక్క సినిమాలతో పాటు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో సన్నీ బిజీబిజీగా గడుపుతున్నారు.