సన్నీలియోన్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతుందని టాక్. గతంలో కూడా సన్నీ ‘కరెంట్ తీగ’ సినిమాలో ఐటెమ్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు మరోసారి ఆమెను ప్రత్యేక పాట కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ హీరోగా ‘గరుడ వేగ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ పెట్టాలనుకున్న చిత్రబృందం దానికోసం సన్నీలియోన్ ను సంప్రదించగా ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు ఓకే చెప్పడంతో ఆమె నటించడానికి సముఖంగా ఉందని అంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె తెలుగు తెరపై మెరవబోతుందన్నమాట.