
Sunny Leone Mumbai investment:
Sunny Leone (కరెంజిత్ కౌర్ వెబర్) ఇటీవల ముంబై ఓషివారా ప్రాంతంలో రూ. 8 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఆమె వీర్ గ్రూప్ నిర్మించిన వీర్ సిగ్నేచర్ అనే కమర్షియల్ ప్రాజెక్టులో ఓ ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ ఫిబ్రవరి 2025లో నమోదైంది.
ఈ ఆఫీస్ స్థలం 176.98 చ.మీ. (1,904.91 చ.అ.) కార్పెట్ ఏరియాతో పాటు 194.67 చ.మీ. (2,095 చ.అ.) బిల్ట్-అప్ ఏరియాను కలిగి ఉంది. మూడు పార్కింగ్ స్పేసులు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ డీల్ కోసం సన్నీ లియోన్ రూ.35.01 లక్షలు స్టాంప్ డ్యూటీగా, రూ.30,000 రిజిస్ట్రేషన్ చార్జ్‌గా చెల్లించింది. ఆమె ఈ ఆఫీస్‌ను ప్రముఖ నిర్మాత, రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆనంద్ పండిట్ నుండి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్ టోటల్ ధమాల్, చెహ్రే, ది బిగ్ బుల్ వంటి సినిమాలకు నిర్మాతగా ఉన్నారు.
వీర్ సిగ్నేచర్ బిల్డింగ్‌లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ వంటి ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ సైతం ఆఫీసులు, ప్రాపర్టీలు కొనుగోలు చేశారు.
సన్నీ లియోన్ బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. 2018లో ఆమె తన స్వంత స్టార్ స్ట్రక్ అనే కాస్మెటిక్స్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఆమె MTV ఇండియా అవార్డ్స్‌లో మోస్ట్ స్టైలిష్ ఫిమేల్ పెర్ఫార్మర్ అవార్డు, PETA ఇండియా నుంచి జంతు సంక్షేమంలో సేవలకు అవార్డు కూడా అందుకుంది.
సన్నీ లియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా వ్యాపారరంగంలో కూడా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ముంబైలో ఆమె కొనుగోలు చేసిన రూ.8 కోట్ల ఆఫీస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Nithya Menen నటించిన Kadhalikka Neramillai తెలుగులో ఎందులో చూడచ్చంటే