HomeTelugu Newsకారణం లేకుండా టార్గెట్‌ చేశారంటున్న సింగర్‌

కారణం లేకుండా టార్గెట్‌ చేశారంటున్న సింగర్‌

10 7
ప్రముఖ సింగర్‌ సునీత కారణం లేకుండా కొందరు తనను టార్గెట్‌ చేశారని, తప్పుడు ప్రచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గత కొంతకాలంగా వస్తున్న వదంతులు, జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల్ని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగపు పోస్ట్‌ చేశారు. ‘కారణం లేకుండా అతి సులభంగా నన్ను టార్గెట్‌ చేసిన వారిని చూశా. జూనియర్‌ సింగర్స్‌ నన్ను దారుణంగా ఇమిటేట్‌ చేయడం చూశా.. అదే పాటలకు ప్రేక్షకులు క్లాప్స్‌ కొట్టారు. కేవలం నాపై వదంతులు చెప్పుకోవడానికి వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేయడం చూశా. పలు వెబ్‌సైట్‌లు నాపై చెత్తగా వార్తలు రాయడం చూశా. వారి సొంత అభద్రతల కారణంగా ప్రజలు నన్ను అకస్మాత్తుగా విడిచిపెట్టి వెళ్లిపోవడం చూశా. నా వ్యక్తిగత జీవితం గురించి మహిళలు భయంకరమైన పుకార్లు వ్యాప్తి చేయడం చూశా. విజయాలు చూశా.. ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా. మొత్తానికి మౌనంగా ఉంటూ జీవితానికి సరిపడా చేసేశా. పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొంటూ ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు’ అని ఆమె పేర్కొన్నారు.

అనంతరం ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులంతా కలిసి రూపొందించిన ప్రత్యేక వీడియోను సునీత షేర్‌ చేశారు. ‘ఇవాళ నన్నెంతో అభిమానించే వారు నా కోసం ఒక్కటయ్యారు. నా పని తీరును గుర్తు చేసి, అభినందించారు. నా ఉనికికి కారణం తెలిపారు. వీరంతా కలిసి నా జీవితానికి మరింత అర్థం తెచ్చారు. మీ అందరీకి నా ధన్యవాదాలు’ అని సునీత పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!