టాలీవుడ్ నటుడు సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. కెమెరామ్యాన్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమవుతున్నారు. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్‌ఎన్‌ఎస్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి, జి. నాగేశ్వర రెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్ పాత్ర లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.
‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సునీల్ ఈ చిత్రంలో మహమ్మద్ ఖయ్యుమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.