భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ ఆవిష్కరించాడు. ఆదివారం విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ టీజర్ లో శృతిమించిన సన్నివేశాలున్నట్లు బాగానే ఉన్నాయి. ‘హలో.. రూమ్ నెంబర్. 302కి ఒక కండోమ్ ప్యాకెట్ కావాలి’ అన్న అమ్మాయి మాటలతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇక చివర్లో అదే అమ్మాయి దెయ్యంగా మారినట్లు కనిపించడంతో టీజర్ ముగుస్తుంది.
ఈ మూవీ గురించి దర్శకుడు మాట్లాడుతూ.. క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ఒకరోజులో అంటే.. 24 గంటల్లో జరిగే కథ’ అని తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత అవినాష్ సుందరపల్లి వెల్లడించారు.