టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్ తాజా చిత్రం కనబడుటలేదు. సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్.బాలరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. హీరోయిన్ శ్రీ దివ్య రిలీజ్ విడుదల చేస్తూ.. చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.
‘కనబడుటలేదు’ టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ టీజర్ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. సునీల్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్ , షేడ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రవీణ్, హిమజ, రవికృష్ణ , కిరీటి, సౌమ్య శెట్టి , ‘C/o కంచరపాలెం’ ఫేమ్ రాజు తదితరులు నటించారు.