తమిళ సూపర్ హిట్ మూవీ ‘మండేలా’ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ రీమేక్ హక్కులను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర దక్కించుకున్నారు. అయితే తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కింది. కానీ సినిమా మొత్తానికి వివాదాలతో పాటుగా సూపర్ హిట్ అందుకొని విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. అలాగే నటుడు యోగిబాబు కూడా ఈ సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను టాలీవుడ్ నటుడు కం కమెడియన్ సునీల్ తో రూపొందించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇంకా..అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది. దాపుపు సునీల్ పేరు ఖరారు అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.