HomeTelugu Trendingపుష్ప: సునీల్‌ ఫస్ట్‌లుక్‌

పుష్ప: సునీల్‌ ఫస్ట్‌లుక్‌

Sunil frist look from pushp

టాలీవుడ్‌ లో హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా పలు సినిమాల్లో అలరించిన సునీల్‌ తొలిసారిగా ‘పుష్ప’ కోసం విల‌న్‌గా మారాడు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాలో సునీల్.. మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో క‌నిపించ‌నునున్నాడు. దీనికి సంబంధించి సునీల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఇందులో మునుపెన్నడూ లేని విధంగా బ‌ట్ట‌త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించాడు సునీల్‌. భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ రానున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌
వస్తుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu