సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుసీంధరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న
చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైద్రాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా
జరిగింది. ఈ సందర్భంగా
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ”సుసీంధరన్ గారు తెరకెక్కించిన ‘నా పేరు శివ’ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ను.
ఆయన సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి, ఈ సినిమా కూడా అంతే నేచురల్ గా ఉంటుంది. నా సినిమాకి తమన్
సంగీతం సమకూర్చడం ఇది మూడోసారి, ఎప్పట్లానే ఈసారి కూడా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాడు” అన్నారు.
చిత్ర దర్శకులు సుసీంధరన్ మాట్లాడుతూ.. ”ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ
భాషల్లో ఏకకాలంలో బైలింగువల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భాషకు తగ్గట్లు వేరువేరుగా
చిత్రీకరణ జరపనున్నాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా చిత్రీకరణను జనవరి, ఫిబ్రవరిలో
ఏకధాటిన పూర్తి చేసి ఏప్రిల్ లేదా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా
అందర్నీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను” అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ.. ”నా రెండో చిత్రంతోనే తమిళనాట అడుగిడుతుండడం, అది కూడా సుసీంధరన్ గారి లాంటి టాలెంటెడ్
డైరెక్టర్ సినిమాలో నటించనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ కు మైలురాయిగా నిలుస్తుందని నమ్మకం
ఉంది” అన్నారు.