టాలీవుడ్ ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే నితిన్, నిఖిల్, రానా ఓ ఇంటివాళ్ళు అయ్యారు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా మరో యంగ్ హీరో కూడా పెళ్ళికి సిద్దమవుతున్నాడని తెలుస్తుంది. హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా సందీప్ కిషన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సందీప్ తాను కూడా పెళ్ళికి రెడీ అయ్యానని హింట్ ఇచ్చాడు. ట్విటర్ వేదికగా ఓ పెద్ద అడుగు వేయబోతున్నా అని పేర్కొన్నాడు. ”2020 నా జీవితం గురించి చాలా విషయాలను పునపరిశీలన చేసుకునేలా చేసింది. నన్ను సంతోషపరిచే విషయాలపై ఆలోచించుకునే అవకాశం కలిగింది. నా జీవితంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి నాకు ధైర్యాన్ని సమయాన్ని ఇవ్వండి… బహుశా చాలా ఉత్తేజకరమైన ఆ వార్తను చెప్పేందుకు ఆగలేను.. సోమవారం వరకూ ఆగండి” అంటూ సందీప్ ట్వీట్ చేశాడు. దాంతో ఈ యంగ్ హీరో కూడా పెళ్ళికి సిద్ధమయ్యాడని టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
2020 has had me revisiting a lot of things about my life & got me thinking on what makes me Happy..
Gave me the time & courage to take the next Big Step in my Life…🤟🏽
Probably also the most exciting…🙇🏽
Can’t wait to share the news 😁
Monday it is ❤️ pic.twitter.com/CwbYLcMSH4— Sundeep Kishan (@sundeepkishan) August 14, 2020