HomeTelugu Newsజనవరిలో 'సుందరాంగుడు'

జనవరిలో ‘సుందరాంగుడు’

Sundarangudu movie release

కృష్ణసాయి టైటిల్ పాత్రలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్-ఎమ్.ఎస్.కె.ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సుందరాంగుడు”. వినయ్ బాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ వినూత్న ప్రేమకథాచిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి మూడోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు .

ఈ సందర్భంగా నిర్మాతలు ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ మాట్లాడుతూ…”మా హీరో కృష్ణ సాయి చాలా అద్భుతంగా నటించాడు. హీరోగా తనకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే చిత్రం “సుందరాంగుడు”. రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు “సుందరాంగుడు” చిత్రానికి ప్రధానాకర్షణ” అని అన్నారు.

జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్, మ్యూజిక్: సిద్ధబాబు, కెమెరా: వెంకట్ హనుమాన్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాతలు: ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్, దర్శకత్వం: వినయ్ బాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu