టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. హీరో రవితేజ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది.. మంచి పాజిటీవ్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సుందరం మాస్టర్ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ దక్కించుకున్నట్లు టాక్.
మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈటీవీ విన్ తో పాటు ఆహా ఓటీటీలోనూ సుందరం మాస్టర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే సుందరం మాస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాని ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ నిర్మించాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా పరిచయమైయాడు. సుందరం మాస్టర్ ప్రమోషన్స్‌లో చిరంజీవి, నాగచైతన్యతో పాటు పలువురు స్టార్లు పాల్గొనడం, టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకుకోవడంతో ఈ చిన్న సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. పాయింట్ బాగున్నా ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవడంతో సుందరం మాస్టర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.