HomeTelugu ReviewsSundaram Master Review : 'సుందరం మాస్టర్'గా జీవించిన వైవా హర్ష

Sundaram Master Review : ‘సుందరం మాస్టర్’గా జీవించిన వైవా హర్ష

Sundaram Master movie Revie

Sundaram Master Review: వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’. నూతన దర్శకుడు కళ్యాణ్ సంతోష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని రవితేజ నిర్మించారు. ఈ సినిమా నేడు ఫిబ్రవరి 23న థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పటి వరకూ సినిమా నుండి విడుదలై అప్డేట్స్‌ అన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంది. అసలు కథ ఏమిటో చూద్దాం..

కథ విషయానికొస్తే.. సుదరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్ స్కూల్ లో సోషల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. పెళ్ళికాని అతను గవర్నమెంట్ జాబ్ అవ్వడంతో ఎక్కువ కట్నం కోసం చూస్తాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే(హర్ష వర్ధన్) స్కూల్ కి వచ్చి అందరు టీచర్స్ ని చూసి సుందరంని సెలెక్ట్ చేసుకొని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గత 90 ఏళ్లుగా మిరియాల మెట్ట ఓ ఊరు ఉంది. అక్కడికి బయటి వాళ్లకి ప్రవేశం లేదు. మొదటిసారి వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశారు అంటూ, ఆ ఊర్లో ఏదో విలువైనది ఉంది, దాన్ని కనుక్కోవడానికి నిన్ను పంపుతున్నాము, ఆరు నెలల్లో సాధిస్తే DEO పోస్ట్ వస్తుందని చెప్తాడు. DEO అయితే కట్నం ఎక్కువ వస్తుందని ఆశతో ఓకే అంటాడు సుదరం.

సుందరం ఆ చిన్న ఊరికి వెళతాడు. అక్కడ A B C Dలు చెప్తుంటే ఆ ఊళ్ళో వాళ్లంతా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ఊరి వాళ్లంతా ఇతను టీచర్ కాదు, ఇంగ్లీష్ రాదు అని ఇంగ్లీష్ లో తిట్టి 15 రోజులు టైం ఇచ్చి తర్వాత నీకు పరీక్ష పెడతాము పాస్ అయితే ఓకే, లేకపోతే ఉరి వేసి చంపేస్తాం అంటారు ఊరిపెద్ద(బాలకృష్ణ నీలకంఠాపురర్). ఆ ఊర్లోనే ఓజా అనే వ్యక్తి సుందరంకి హెల్ప్ చేస్తాడు.

ఆ ఊరి గురించి చెప్తూ.. 1920లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గర దొరికే మిరియాల కోసం మమ్మల్ని బానిసలుగా చేసుకుంటే ఓ దొర వచ్చి బ్రిటిష్ వాళ్ళని పంపించేసి అతను ఇక్కడే సెటిల్ అయి మాకు ఇంగ్లీష్ నేర్పించాడు. అతని కొడుకు కొన్ని ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్ చెప్పాడు, అతను చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశామని, బయట వాళ్ళు మాపై దాడి చేయకుండా మా ఊరు దారులన్నీ మూసేసాం అంటూ ఆ ఊరి గురించి అన్ని విషయాలు వివరిస్తాడు.

సుందరం ఓజా సహాయంతో ఆ ఊరివాళ్ళు పెట్టె పరీక్ష పాస్ అవుతాడు. ఆ తరువాత ఊర్లో దొరికే విలువైన దాని గురించి వెతుకే పనిలో పడతాడు. కొంతమంది ఆ ఊరి గ్రామ దేవత విగ్రహం అని చెప్పడంతో చూడటానికి వెళ్తే అక్కడ ఆ విగ్రహం ఉండదు. అసలు ఆ విగ్రహం ఏమైంది? నిజంగానే విగ్రహం విలువైందా? సుందరం మాస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాడా? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళకి నలుపు రంగు అంటే ఎందుకిష్టం? ఆ ఊరి నుంచి సుందరం మాస్టర్ ఎప్పుడు బయటకి వచ్చాడు.. మిగతా కథ అంతా సినిమా చూసి తెలుసుకోవాల్సింది.

కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి వార్తలు మనము చూసాము. అలాగే మిరియాల మెట్ట అనే ఊరిని తీసుకొని వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందరం మాస్టర్ ని రాసుకున్నారు. మొదటి హాఫ్ అంతా సుందరం మాస్టర్ గురించి, అతను అక్కడికి వెళ్లి పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు. ఇంటర్వెల్ కి విగ్రహం మాయమవ్వడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ విగ్రహం గురించి, అక్కడ కల్మషం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం.. లాంటి ఎమోషన్స్ తో సాగుతుంది.

ఆ ఊరి వాళ్లకి స్వతంత్రం వచ్చినట్టు కూడా తెలియకపోవడం, గాంధీ ఎలా ఉంటారో, అసలు బయట ఒక ప్రపంచం ఇంతలా మారిందని తెలియకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. క్రికెట్, ఇప్పుడు ఉన్న డబ్బుల గురించి కూడా వారికి తెలియదు. గాంధీ ఇతనే అని 500 నోటు సుందరం మాస్టర్ చూపిస్తే ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవడం.. లాంటి సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇవే సీన్స్ లో కొన్ని మాత్రం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ ని గ్రాఫిక్స్ లో చూపించారు.

ఇన్నాళ్లు కామెడీతో మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పండించాడు. ఆ పాత్రలో హర్ష తప్ప ఇంకొకరిని ఊహించలేము. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు.

సినిమాటిక్ విజువల్స్ లో అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ప్రపంచానికి దూరంగా ఓ పల్లెటూరు ఉంటె అలాగే ఉంటుందేమో అనిపించేలా కట్టారు. కథ, కథనం బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ నిజమో, కలో తెలియకుండా ఉండేలా రాసిన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu