HomeTelugu Big Storiesసుమంత్ కొత్త సినిమా!

సుమంత్ కొత్త సినిమా!

సుమంత్‌, ఆకాంక్ష సింఘ్‌ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్‌ క్లాప్‌ నివ్వగా.., నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా గారి అమ్మ గారైన సావిత్రి గారు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్‌, కాదంబరి కిరణ్‌, ప్రవీణ్‌ (వెంకట్‌) యాదవ్‌, బందరు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. 
సుమంత్‌, ఆకాంక్ష సింఘ్‌, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్‌కుమార్‌, మిర్చి కిరణ్‌, అభినవ్‌, అప్పాజీ అంబరీష మొదలగువారు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్‌, కెమెరా: సతీష్‌ ముత్యాల, ఆర్ట్‌: మురళీ, స్టిల్స్‌: రాజు, ఛీప్‌ కాస్ట్యూమర్‌: గోవింద్‌, మేకప్‌: మోహన్‌, మ్యూజిక్‌: శ్రవణ్‌, పి.ఆర్‌.ఓ.: బి. వీరబాబు, మేనేజర్‌: వాసు, ప్రొడ్యూసర్‌: రాహుల్‌ యాదవ్‌ నక్కా, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గౌతం తిన్ననూరి. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu