హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా.. డోనరుడా.. ఫస్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లోని విలక్షణత వల్ల ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమాతో పల్లవి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. తనికెళ్ళభరణి ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.
గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన మల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క్షణం వంటి సూపర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించిన షనీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, క్షణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కిట్టు విస్సాప్రగడ, సాగర్ రాచకొండ మాటలు అందిస్తున్నారు. వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్‌దస్త్ శేషు, సుంకరలక్ష్మి, పుష్ప, చలపతిరాజు ఇతర తారాగణంగా నటించారు.