‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రంలో సుమంత్ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. ఈ పాత్ర హీరోకి దీటుగా నిలిచే మరో హీరో పాత్ర కావడంతో ఒప్పుకున్నారట. 1964 బ్యాక్‌డ్రాప్‌లో ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మిస్తున్న ఈ బహు భాషా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు సుమంత్ హీరోగా నటించిన ‘అనగనగా ఒక రౌడీ’ విడుదలకు సిద్ధమైంది. అయితే హీరోగా 20కు పైగా సినిమాలు చేసిన సుమంత్ ఇలా మరో హీరో సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడం చర్చనీయాశంగా మారింది.