Roshan Kanakala:టాలీవుడ్‌లో సీనియర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ సినిమా బబుల్‌గమ్‌తో హీరోగా వస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. బబుల్‌గమ్ సినిమాకు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకుడు. రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది.
రోషన్ ‘బబుల్‌గమ్’ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తన స్కిన్ కలర్ విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై రోషన్ స్పందించాడు.
కర్రెగా ఉన్నాడు. వీడు హీరో ఏంటి అని తన గురించి మాట్లాడుకోవడం విన్నానని, చదివానని రోషన్ కనకాల అన్నాడు. నా ముఖం బాగా లేదని దారుణంగా నెగెటివ్ కామెంట్స్ చేశారని రోషన్ కనకాల అన్నాడు.
నేను ఇలాగే పుట్టాను, ఇలాగే ఉంటాను. ఒక మనిషికి నలుపు, తెలుపు అనేది అందం కాదు. ఒక మనిషి సక్సెస్‌ను డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లిన్ మాత్రమేనని రోషన్ కనకాల అన్నాడు.
డిసెంబర్ 29న థియేటర్లకు రండి. బబుల్‌గమ్‌లో ఈ ఆదిగాడి లవ్‌ను చూడండి. గౌరవం కోసం ఆదిగాడు చేసే పోరాటం చూడండి అని రోషన్ కనకాల కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రోషన్ కనకాల కామెంట్స్ వైరల్ అయ్యాయి.